Ind-Eng: పంత్ మళ్ళీ సెంచరీ..వైరల్ గా మారిన సెలబ్రేషన్స్

లీడ్స్ లో జరుగుతున్న మొదటి టెస్ట్ లో వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ మళ్ళీ సెంచరీ నమోదు చేశాడు. దీని తర్వాత అతను చేసిన సెలబ్రేషన్స్ వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. 

author-image
By Manogna alamuru
New Update
rishab

Rishabh Pant Celebrations

 

వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ లో ఫెయిల్ అయినా టెస్ట్ లలో మాత్రం రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ లోనూ సెంచరీతో అదరగొట్టాడు. 140 బంతుల్లో 118 పరుగులు చేశాడు పంత్. ఆ తరువాత బషీర్ వేసిన 71.4 ఓవర్‌కు జాక్‌ క్రాలీకి చిక్కాడు.

డెలీ అలీ సెలబ్రేషన్స్..

మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసినప్పుడు పంత్ సోమర్ సాల్ట్ చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో శతకం తర్వాత కూడా అందరూ అలానే చేస్తాడు అనుకున్నారు. గ్లవ్, హెల్మెట్ తీసి రెడీ అవుతుంటే..కామెంటేటర్లతో సహా అందరూ ఎదరు చేశారు. కానీ పంత్ మాత్రం చూపుడు వేలు, బొటన వేలిని కలిపి జీరోలా చేసి అందులో నుంచి చూస్తూ సైన్ చేశాడు. ఇది స్పోర్టస్ లో ఒక ఫేమస్ సెలబ్రేషన్. ధీనిని డెలీ అలీ సెలబ్రేషన్ అంటారు. ఫేమస్ ఫుట్ బాల్ ప్లేయర్ డెలీ అలీ ఏడేళ్ల క్రితం దీనిని చేశాడు. దీని మీద బోలెడు రీల్స్ కూడా వచ్చాయి. దీనికి ఓకే అని అర్ధమట. అప్పట్లో డెలీ అలీ సెలబ్రేషన్ పెద్ద సెన్సేషన్ అయింది. ఇప్పుడు రిషబ్ పంత్ మళ్ళీ చేశాడు. దీంతో ఇప్పుడు డెలీ అలీ మళ్ళీ ట్రెండ్ లోకి వచ్చింది. పంత్ సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు