ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అత్యంత సాధారణ పోషకాల కొరతలో విటమిన్ డి లోపం ఒకటి.

విటమిన్ డి లోపం ప్రపంచ జనాభాలో 13 శాతం మందిని ప్రభావితం చేస్తుందని అంచనా.

శరీరంలో డీ విటమిన్ లోపిస్తే.. ఎముకలు బలహీన పడటం, కీళ్ల నొప్పులు, పగుళ్లు, బోలు ఎముకల వ్యాధి, కండరాల తిమ్మిరి, అలసట, మూడ్ మార్పులు వంటివి ఏర్పడతాయి.

విటమిన్ D లోపిస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు

సూర్యకాంతిలో ఉండే మన సమయాన్ని పెంచడం ద్వారా  కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం ద్వారా మనం  డీ  విటమిన్‌ను ఎక్కువ మొత్తంలో పొందవచ్చు.

విటమిన్ డి ఎక్కువగా కొవ్వు చేపలు, సీఫుడ్ లో లభిస్తుంది. అందుకే వాటిని ఎక్కువ తీసుకోవడం ద్వారా డీ విటమిన్ తగ్గకుండా చూసుకోవచ్చు.

U.S. నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, 600-800 IU రోజువారీ విటమిన్ D సాధారణంగా సరిపోతుంది.

సమతుల్యమైన ఆహరం తీసుకోవడం ద్వారా విటమిన్ డి లోపం ఏర్పడకుండా చూసుకోవచ్చు. 

విటమిన్ D లోపం ఏర్పడినట్టు అనుమానం వస్తే వెంటనే తగిన వైద్య సలహా పొందడం చాలా అవసరం