Andhra Pradesh: వైసీపీలో ప్రధాన కార్యదర్శుల నియామకం వైసీపీలో ఈరోజు పలు నియామకాలు జరిగాయి. ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురిని నియమించారు వైఎస్ జగన్. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వేంపల్లి సతీష్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను నియమించారు. By Manogna alamuru 22 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి YCP General Secretaries: వైసీపీకి సంబంధించిన పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు నియామకాలు చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు గా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డిని నియమించారు. పార్టీ మరో ప్రధాన కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించారు. వీరితో పాటూమరికొన్ని అనుబంధ విభాగాలకు కూడా నియామకాలు చేశారు. ఇందులో భాగంగా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా జక్కంపూడి రాజా, వైసీపీ బీసీ సెల అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైసీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడిగా సుధాకర్‌బాబు, వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి, వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్య, వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా దూలం నాగేశ్వరరావు, వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా పేరాడ తిలక్ లను నియమించారు జగన్. దువ్వాడ శ్రీనివాస్ స్థానంలో పేరాడ తిలక్‌ను అపాయింట్ చేశారు. Also Read: Andhra Pradesh: అచ్యుతాపురం సెజ్ ప్రమాదానికి 10 కారణాలు #genaral-secretaries #ys-jagan #ycp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి