YCP New Song: ఏపీలో జరుగుతున్న దాడులపై వైసీపీ సాంగ్

AP: రాష్ట్రంలో తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులపై వైసీపీ నిరసిస్తూ పాటను విడుదల చేసింది. 'నేడు నీది, రేపు మాది.. మరచిపోకు ఈ నిజం' అంటూ ట్విట్టర్ (X) లో పోస్ట్ చేసింది. జరుగుతున్న దాడులు ఆధారంగా ఓ వీడియోను రూపొందించింది.

CID Enquiry: జగన్ పై సీఐడీ విచారణ.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం
New Update

YCP New Song: రాష్ట్రంలో తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులపై వైసీపీ నిరసిస్తూ పాటను విడుదల చేసింది. 'నేడు నీది, రేపు మాది.. మరచిపోకు ఈ నిజం' అంటూ ట్విట్టర్ (X) లో పోస్ట్ చేసింది. జరుగుతున్న దాడులు ఆధారంగా ఓ వీడియోను రూపొందించింది. కాగా వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై మాజీ సీఎం జగన్ (YS Jagan) గవర్నర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

గవర్నర్ కు జగన్ రిక్వెస్ట్..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు (Chandrababu) రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వ చ్చిందంటూ పోస్ట్ పెట్టారు. ‘రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది.

వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. పార్టీనుంచి పోటీచేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయింది. ఉన్నత చదవులకు కేంద్రాలైన యూనివర్శిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గడచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు.

ప్రజాస్వామ్యానికి, పౌరస్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోంది. గౌరవ గవర్నర్ గారు. @governorap జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, నా అన్నదమ్ములకు, నా అక్కచెల్లెమ్మలకు @YSRCParty తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు. పోస్ట్ వైరల్ అవుతోంది.

#ycp #ys-jagan #tdp #ap
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe