YCP Rajya Sabha: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు! వైసీపీ అధిష్టానం రాజ్యసభ్యులను ఖరారు చేసింది. మొత్తం ముగ్గురు కొత్త అభ్యర్థులను రాజ్యసభకు పంపాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైవీ సుబ్బారావు రెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి పేర్లను సీఎం జగన్ ఫైనల్ చేసినట్లు సమాచారం. By V.J Reddy 06 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి YCP Rajya Sabha Candidates: మరికొన్ని నెలల్లో రాబోయే లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని సీఎం జగన్ (AP CM Jagan) వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో గెలిచే అవకాశం లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ.. ఇప్పటికే ఆరు జాబితాల్లో ఎంపీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేశారు సీఎం జగన్. తాజాగా వైసీపీ అధిష్టానం రాజ్యసభ్యులను ఖరారు చేసింది. మొత్తం ముగ్గురు అభ్యర్థులను రాజ్యసభకు పంపాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ALSO READ: సీఎం రేవంత్ దూకుడు.. కేసీఆర్ కీలక నిర్ణయం వైవీ సుబ్బారావు రెడ్డి (YV Subba Reddy), గొల్ల బాబురావు (Golla Baburao), మేడా రఘునాథ్ రెడ్డి (Meda Raghunadha Reddy) పేర్లను సీఎం జగన్ రాజ్యసభకు పంపే అభ్యర్థులుగా ఫైనల్ చేసినట్లు సమాచారం. రాజకీయ, సామాజిక, సమీకరణాల కోణంలోనే రాజ్యసభ సభ్యులు ఎంపిక చేసింది వైసీపీ. ఈ నెలలో మూడు రాజ్యసభ స్థానాలు కాళీ అవనున్నాయి. ఈ నెలతో సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్రబాబు రాజ్యసభ పదవీ కాలం ముగియనుంది. వైసీపీ ఆరవ జాబితా ఇదే.. ఏపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 6వ జాబితాను (YCP 6th List) ప్రకటించింది వైసీపీ. సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆమోదముద్ర తర్వాత 6వ జాబితాను ఆ పార్టీ శుక్రవారం రిలీజ్ చేసింది. -రాజమండ్రి (ఎంపీ) – డాక్టర్ గూడూరి శ్రీనివాస్ -నర్సాపురం (ఎంపీ) – గూడూరి ఉమాబాల -గుంటూరు (ఎంపీ ) – ఉమ్మారెడ్డి వెంకట రమణ -చిత్తూరు (ఎస్సీ) (ఎంపీ) – ఎన్ రెడ్డప్ప -మైలవరం – సర్నాల తిరుపతిరావు యాదవ్ -మార్కాపురం – అన్నా రాంబాబు -గిద్దలూరు – కె. నాగార్జున రెడ్డి -నెల్లూరు సిటీ – ఎండీ. ఖలీల్ (డిప్యూటీ మేయర్) -జీడీ నెల్లూరు – కె నారాయణ స్వామి -ఎమ్మిగనూరు – బుట్టా రేణుక ALSO READ: అబద్దాలతో ప్రభుత్వాన్ని నడపలేరు.. సీఎం రేవంత్‌పై హరీష్ ఫైర్ #ycp-party #rajyasabha #ap-elections-2024 #meda-raghunadha-reddy #yv-subba-reddy #golla-baburao #cm-jagan #ycp-rajya-sabha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి