Crime : లాడ్జికి వెళ్లిన దంపతులపై దారుణం.. భార్యపై గ్యాంగ్ రేప్

కర్నాటకలో మరో గ్యాంగ్ రేప్ సంఘటన కలకలం రేపింది. భర్తతో కలిసి లాడ్జికి వెళ్లిన మహిళపై ఏడుగురు దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా ముగ్గురిని అరెస్ట్ చేయగా.. పరారిలో ఉన్న నలుగురికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Crime : లాడ్జికి వెళ్లిన దంపతులపై దారుణం.. భార్యపై గ్యాంగ్ రేప్
New Update

Crime : మరో మహిళ కామాంధుల చేతిలో బలైంది. భర్త వెంట ఉండగానే సామూహిక అత్యాచారానికి గురైంది. ఓ పనిమీద బయటకెళ్లిన జంట కాసేపు సేద తీరడానికి లాడ్జి (lodge) కి వెళ్లడమే వారికి శాపంగా మారింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు దుర్మార్గులు ఆ మహిళలను చిత్ర హింసలకు గురిచేసిన భయంకరమైన సంఘటన కర్నాటక (Karnataka) రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఏడుగురు ఆగంతకులు..
ఈ మేరకు పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హావేరి జిల్లా హానగల్‌ ఠాణా పరిధిలో ఉండే ఓ లాడ్జికి తౌసిఫ్‌ అనే వ్యక్తి తన భార్యతో కలిసి వెళ్లినట్లు చెప్పారు. అయితే ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో ఏడుగురు ఆగంతకులు ఆమెను అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బుధవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే మొదట వాళ్లు చెప్పే విషయాలకు ఆధారాలు చూపించకుండా.. పొంతన లేకుండా మాట్లాడటంతో మొదట కేసు నమోదు చేయలేదు. అదే సమయంలో ఒక యువతిపై కొందరు నైతిక పోలీసుగిరీ (మోరల్‌ పోలీసింగ్‌) చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఆ లాడ్జికి వెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించాం. ఈ క్రమంలోనే జంటపై ఏడుగురు వ్యక్తులు అనుచితంగా ప్రవర్తించినట్లు గుర్తించామని తెలిపారు. ఇక వెంటనే దీనిపై యాక్షన్ మొదలుపెట్టిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి విచారించగా దాడి చేసినట్లు అంగీకరించారని, పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అన్షుకుమార్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి : Vijay Sethupathi : ఆమెతో నటించాలంటే భయమేసింది.. విజయ్ సేతుపతి

కాపు కాసి జంటలపై దాడులు..
ఇక ఈ కేసులో బాధితురాలు తౌసిఫ్ భార్య కాదని, పరిచయం ఉన్న కేఎస్‌ఆర్టీసీ డ్రైవరుతో మాట్లాడేందుకు ఆమె హోటల్‌ గదికి వెళ్లిందని, ఆ సమయంలో దాడి జరిగిందని అనుమానిస్తున్నారు. నిందితులు ఈ లాడ్జి వద్ద కాపు కాసి జంటలపై తరచూ ఇలాంటి దాడులకు, అత్యాచారాలకు పాల్పడుతుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ప్రభుత్వం ఈ ఘటన బయటకు రాకుండా ప్రయత్నిస్తోందని విపక్ష భాజపా ధ్వజమెత్తింది. మూకుమ్మడి దాడి, సామూహిక అత్యాచార ఘటనను ఎందుకు తొక్కిపెడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలాంటి పలు అకృత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని భాజపా రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర విమర్శలు గుప్పించారు.

#karnataka #lodge #gang-rape #women
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి