Morning Walking Benefits: శీతాకాలమైనా.. వేసవి కాలమైనా.. ప్రతి వ్యక్తి ఉదయం వాకింగ్ కానీ, వ్యాయామం కానీ చేయాలని సూచిస్తున్నారు వైద్యులు. శరీరాన్ని చురుగ్గా ఉంచుకుంటే వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య పరంగా ఎంతో మేలు జరుగుతుందని సూచిస్తున్నారు. అయితే, ఉదయం నడకే మేలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు, అదనపు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. ఈ సమయంలో నడవడం వలన కండరాల్లో ఎక్కువ కదలిక ఏర్పడుతుంది. ఇక ఉదయం వేళ సుదీర్ఘమైన నడక సమయంలో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అప్పుడు అలాగే ఉండనివ్వాలి. వెంటనే నీరు తాగొద్దని సూచిస్తున్నారు నిపుణులు. అయితే, మార్నింగ్ వాక్ చేసే ముందు కొన్ని ప్రత్యేక విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలని, లేదంటే అధిక నడక హాని కలిగించవచ్చుని హెచ్చరిస్తున్నారు. మరి జాగ్రత్తలేంటో ఓసారి చూద్దాం..
కాలకృత్యాలు తీర్చుకోండి..
మార్నింగ్ వాక్ కు వెళ్లే ముందు పొట్ట ఖాళీగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే.. పొట్ట శుభ్రంగా లేకుంటే మలబద్ధకం ఏర్పడుతుంది. శరీర వేడి కడుపులో మలబద్ధకం సమస్యకు కారణం అవుతుంది. ఇది ప్రేగు కదలికను ప్రభావితం చేస్తుంది.
మార్నింగ్ వాక్‌కి వెళ్లే నీళ్లు తాగాలి..
మార్నింగ్ వాక్ కు వెళ్లే ముందు పుష్కలంగా నీళ్లు తాగడం చాలా ముఖ్యం. తద్వారా శరీరం నిర్జలీకరణకు గురవకుండా ఉంటుంది. కండరాలు బలంగా ఉంటాయి. శరీరం శక్తిని కలిగి ఉంటుంది. నడవడానికి సౌకర్యంగా ఉండాలి. నీరు తాగడం వల్ల మార్నింగ్ వాక్ చేసే సమయంలో శరీరంలో దృఢత్వం, కండరాల్లో నొప్పి ఉండదు.
స్ట్రెచింగ్ వ్యాయామాలు..
మార్నింగ్ వాకింగ్ ప్రారంభించే ముందు.. స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. దీని కారణంగా రక్త ప్రసరణ పెరుగుతుంది. నడక సామర్థ్యం పెరుగుతుంది.
ఒక బ్యాగ్..
చలికాలంలో మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నట్లయితే.. మీ వెంట ఒక బ్యాగ్ తీసుకెళ్లండి. వాటర్ బాటిల్, ఫోన్, హెడ్‌ఫోన్‌లు పెట్టుకోవడానికి ఉపకరిస్తుంది. అయితే, ఈ బ్యాగ్ మీ జాకెట్‌లో ఇమిడిపోయేలా ఉండాలి.
గమనిక: పైన వార్తలో పేర్కొన్న వివరాలను ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని RTV ధృవీకరించడం లేదు. ఏమైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించిన తరువాత వారి సలహాలు, సూచనల మేరకు వ్యాయామం, వాకింగ్ చేయడం ఉత్తమం.
Also Read:
ఆరు గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ రెడీ..!
పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..