Health Tips : భారతీయుల్లో భారీగా పెరిగిన బద్దకం..WHO సంచలన సర్వే! భారతీయులు సగానికి పైగా ఫిజికల్ యాక్టివిటీపై దృష్టి సారించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. యువత 30 ఏళ్లు కూడా దాటకముందే అనేక వ్యాధుల బారిన పడుతున్నట్లు తాజా సర్వేలో వెల్లడించింది. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలని సూచించింది. By srinivas 20 Jul 2024 in ఇంటర్నేషనల్ లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి WHO : ఈ తరం యువకులు, వయోజనుల్లో శరీరానికి కావాల్సిన వ్యాయామం (Exercise) లభించట్లేదని వైద్యులు చెబుతున్నారు. ఈ కారణంగానే దీర్ఘకాలిక వ్యాధులు అటాక్ చేస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారతీయులు సగానికి పైగా ఫిజికల్ యాక్టివిటీపై అసలు దృష్టి సారించడం లేదంటున్నారు. ఈ పరిస్థితి ఒక వ్యక్తి, కుటుంబానికే కాకుండా దేశ ఆరోగ్య వ్యవస్థకు ముప్పుగా మారుతుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. కనీసం వారానికి150 నిమిషాలు వ్యాయామంపై దృష్టి పెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఒక వారానికి 150 నుంచి 300 నిమిషాలు.. ఈ మేరకు భారత్ (India) లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫారసుకు తగ్గట్టుగా వ్యాయామం కోసం కనీస సమయం కేటాయించడం లేదని లాన్సెట్ అధ్యయనం వెల్లడించించింది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. ఏరోబిక్ యాక్టివిటీ మధ్యస్థాయిలో చేసినప్పుడు వయోజనులు ఒక వారానికి 150 నుంచి 300 నిమిషాలు వెచ్చించాలి. అదే ఆ శ్రమ ఎక్కువగా ఉంటే 75 నుంచి 150 నిమిషాలు కేటాయించాలని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 5 వయసు నుంచి అన్ని వయసుల వారికి తగ్గట్టుగా సిఫారసులు చేసింది. ‘శారీరక శ్రమకు దూరంగా ఉండటం ప్రపంచ ఆరోగ్యానికి పొంచి ఉన్న ఒక ముప్పు. అది దీర్ఘకాలిక వ్యాధుల భారాన్ని గణనీయంగా పెంచుతుంది’’ అని డబ్ల్యూహెచ్ఓకు చెందిన హెల్త్ ప్రమోషన్ డైరెక్టర్ డాక్టర్ రుడిగర్ క్రెచ్ వెల్లడించారు. భారత్లో 10 కోట్లమందికి పైగా మధుమేహం.. మధుమేహం (Diabetes), హైపర్టెన్షన్, గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. భారత్లో 10 కోట్లమందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మన జీవనశైలిలో శారీరక శ్రమను జోడిస్తే.. వ్యక్తిగతంగానే గాకుండా దేశ ఆరోగ్య వ్యవస్థపై కూడా భారం తగ్గుతుందని సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో యువతలో 30 ఏళ్లు కూడా దాటకముందే మోకాళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. అదే నిరంతర వ్యాయామం చేయడం వల్ల కండరాలు, ఎముకలు దృఢంగా మారతాయి. ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ దశ దాటాక ఎముకల వేగంగా పెళుసుబారుతున్నాయని, దానివల్ల ఫ్రాక్చర్లకు అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. యోగా లేక శారీరక శ్రమ కలిగించే క్రీడల వైపు దృష్టిసారించడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చని సూచించారు. వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు వ్యాయామం తప్పనిసరి అంటున్నారు. Also Read : నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం #who #diabetes #life-style #exercise మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి