Covid: భారత్ లో కొత్త కోవిడ్ వేరియంట్.. దాని నుంచి ఎలా రక్షణ పొందాలి? భారత్ లో కొత్త కోవిడ్ వేరియంట్లు వ్యాపిస్తున్నాయి. మ్యుటేషన్లతో ఆ వేరియంట్లు వ్యాప్తి వేగంగా ఉంది. వాటిని సంయుక్తంగా ఫ్లిర్ట్ అని అంటున్నారు.ఇటీవల అమెరికా లో కోవిడ్ కేసుల సంఖ్య పెరగడానికి ఆ ఫ్లిర్ట్ వేరియంట్లే కారణమని తెలుస్తోంది. By Bhavana 16 May 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Covid New Variant In India : భారత్ లో కొత్త కోవిడ్ వేరియంట్లు(Covid Variants) వ్యాపిస్తున్నాయి. మ్యుటేషన్లతో(Mutations) ఆ వేరియంట్లు వ్యాప్తి వేగంగా ఉంది. వాటిని సంయుక్తంగా ఫ్లిర్ట్ అని అంటున్నారు. ఓ మీడియా కథనం ప్రకారం ఇటీవల అమెరికా లో కోవిడ్ కేసుల సంఖ్య పెరగడానికి ఆ ఫ్లిర్ట్ వేరియంట్లే కారణమని తెలుస్తోంది. కొత్త వేరియంట్లలో కేపీ.2, కేపీ1.1, ఎఫ్ఎల్ఐఆర్‌టీ ఉన్నాయి. మ్యుటేషన్ల నుంచి వచ్చిన పదాలతో ఈ వేరియంట్లకు పేర్లు పెడుతున్నారు. జేఎన్.1 వేరియంట్ నుంచి ఈ కొత్త వేరియంట్ల మ్యుటేషన్ అయినట్లు తెలుస్తోంది. కేపీ.2 వేరియంట్ ఏంటో తెలుసుకుందాం. ఇది ఒమిక్రాన్ జేఎన్.1 వేరియంట్ నుంచే పుట్టింది. ఇక జేఎన్.1 కేసుల సంఖ్యను ఈ కొత్త వైరస్ అధిగమిస్తుంది. అమెరికా, కెనడా దేశాల్లో కేపీ.2 వేరియంట్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఫ్లిర్ట్ కేసులు కూడా అమెరికా(America) లో శరవేగంగా వ్యాపిస్తున్నాయి. వీటినే ఇండియాలో కూడా డిటెక్ట్ చేశారు. మహారాష్ట్రలోనే కేపీ.2కు చెందిన 91 కొత్త కేసులను ఇప్పటికే గుర్తించారు. కర్నాటకలో కూడా ఈ కేసుల వల్ల ఆందోళన చెందుతున్నట్లు అధికారులు వివరించారు. ఏప్రిల్ నెలలో ఈ వేరియంట్ చాలా డామినాంట్‌గా ఉన్నది. జనవరిలో తొలిసారి ఈ కేసుకు చెందిన ఆనవాళ్లు గుర్తించారు. ఔరంగబాద్, లాతూర్, సంఘ్‌లియోన్ థానే, సోలాపూర్, పూణె, అమరావతి, నాసిక్, అహ్మద్‌నగర్ నగరాల్లో ఈ కేసులను గుర్తించారు. ఎస్ ప్రోటీన్‌లో మూడు సబ్‌స్టిట్యూషన్స్ ఉండడం వల్ల.. కేపీ.2 వేరియంట్.. జేఎన్.1 నుంచి వచ్చినట్లు నిర్ధారణ అవుతున్నది. కోవిడ్ కేసుల్లో కేపీ.1 వల్ల 28 శాతం కేసులు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక కేపీ.1.1 వేరియంట్ వల్ల కేవలం 7.1 శాతం కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయి. ఇమ్యూనిటీ నుంచి తప్పించుకోవడంలో జేఎన్.1తో పోలిస్తే కేపీ.2 ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. దాని వల్లే ఈ వేరియంట్ తో ఎక్కువ ఇన్ఫెక్షన్ జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు కూడా కేపీ.2 వేరియంట్ సోకే ప్రమాదం ఉందని కొలంబియా యూనివర్సిటీ వైరాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ హో తెలిపారు. ఫ్లిర్ట్ వేరియంట్(Flirt Variant) వల్ల.. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, ముక్కు కారడం, తల-ఒళ్లునొప్పులు, గుండె పట్టేయడం, శ్వాససరిగా తీసుకోలేకపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. Also read: నేటి నుంచే ఈఏపీ సెట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! #covid #flirt-variant #india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి