సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన యూట్యూర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు షణ్ముఖ్

షణ్ముఖ్ తన యాక్టింగ్, కంటెంట్ తో అతి తక్కువ వయసులోనే ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నాడు

అయితే  ఇటీవలే డ్రగ్స్ కేసులో పట్టుబడిన షన్ను సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

ఇక అరెస్టులు, కేసుల తర్వాత షన్ను మరో కొత్త ప్రాజెక్ట్ తో మళ్లీ తన ప్రయాణం మొదలుపెట్టాడు.

తాజాగా  'లీలా' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందు రాబోతున్నట్లు తెలిపారు మేకర్స్.

ఈ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూజా కార్యకార్యక్రమాలు మంగళవారం గ్రాండ్ గా నిర్వహించారు.

ఇందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సీరీస్ ను తెరకెక్కిస్తున్నారు