ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు గురించి ఇప్పుడు తెలుసుకుందాము..ఈ పండును సామాన్యుడు కొనలేడు.

యుబారి పుచ్చకాయ. ఈ పండును   జపాన్‌లో పండిస్తారు.

సాధారణంగా మార్కెట్ లో పుచ్చకాయ కిలో రూ.40 నుంచి రూ.50 వరకుఉంటుంది.

కానీ జపాన్‌కు చెందిన యుబారీ మెలోన్ పండు

దాదాపు రూ. 20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతుంది.

యుబారి పుచ్చకాయను విక్రయించాలంటే వేలంలో పాల్గొనాలి. 

వేలంలో అత్యధిక ధర పలికిన వ్యక్తి మాత్రమే యుబారి పుచ్చకాయను కొనగలరు 

యుబారి పుచ్చకాయ చాలా ఖరీదైనది ఎందుకంటే దీన్ని ప్రత్యేకమైన పద్ధతిలో సాగు చేస్తారు .

సాధారణంగా ఏ పంటైన  సూర్యకాంతిలో సాగు చేస్తారు, కానీ యుబారి పుచ్చకాయను సూర్యకాంతిలో పండించరు.

యుబారి పుచ్చకాయను గ్రీన్‌హౌస్‌లో పండిస్తారు.ఈ పండు చాలా అరుదుగా కనిపిస్తుంది.