వెనిస్ ఆఫ్ ఈస్ట్..పురాతన కోటలు, అందమైన సరస్సులు
By Bhoomi
వెనిస్ ఇటలీలోని ఒక అందమైన నగరం
కానీ మీరు ఇటలీకి వెళ్లలేకపోతే... భారత్ లో వెనిస్ ఆఫ్ ఈస్ట్ అని పిలిచే ఈ నగరానికి వెళ్లొచ్చు.
ఉదయ్ పూర్ ను వెనిస్ ఆఫ్ ఈస్ట్ అని పిలుస్తారు. ఈ నగరానికి చాలా ప్రత్యేకత ఉంది.
1559లో ఉదయ్ సింగ్ అనే రాజు ఈ నగరాన్ని పాలించాడు.
ఈ నగరం అచ్చం వెనిస్ సిటీ వలే ఉంటుంది. చుట్టూ సరస్సులు, పురాతనకోటలు ఉంటాయి.
నదుల ఒడ్డున రాజభవనాలు, హవేలీలు ఉన్నాయి
.
ప్రతిఏటా వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తారు.
ఇక్కడి వాతావరణం మనస్సును ఆహ్లాదపరుస్తుంది.
సిటీ ప్యాలెస్,లేక్ ప్యాలెస్, జగ్ మందిర్ ను సందర్శించవచ్చు
.
మాన్ సూన్ ప్యాలెస్ తోపటు ఫతేసాగర్ సరస్సు, పిచోలా సరస్సు కూడా చూడవచ్చు.
ఇక్కడ ఎన్నో సాంస్కృతిక విషయాలను తెలుసుకోవచ్చు.