పనసకాయ వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

పనసలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మంచి ఆరోగ్యాన్నిస్తుంది.

ఈ పండులో ‘ఎ',‘సి' విటమిన్లు స్వల్పంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం మెండుగా ఉండి ఆరోగ్యానికి బాగా సహాయపడుతాయి.

అమితంగా పనస పండును తినరాదు. తక్కువగా తింటేనే మేలు కలుగుతుంది.

లవణాలు, విటమిన్లు తక్కువ కాబట్టి, ఈ పండు జీర్ణం కావటం కాస్త కష్టం.

పనస గింజల్లో తేమ చాల తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గింజలు ఇంకా కఠినంగా జీర్ణం అవుతాయి. 

పనసపండులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ శక్తిని మెరుగు పరచును. అజీర్తి, అల్సర్లను కూడా నయం చేస్తుంది.

పనస పండు లోని యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్‌ క్యాన్సర్‌ వ్యాధిని నిరోధిస్తాయి

పొటాషియం మెండుగా లభించడం వల్ల అదిక రక్తపోటును తగ్గిస్తుంది.

రక్తపోటు ఉన్నవారు పొటాషియం సమృద్ధిగా లభించే పనసపండును తీసుకుంటే సమస్య తీవ్రత తగ్గుతుంది.