60లో 30లా కనిపించే నీతా అంబానీ ఫిట్‎నెస్ రహస్యం తెలుసా..?

By Bhoomi

రిలయన్స్ ఫౌండేషన్ చైర్‎పర్సన్, ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ భారత్ లో అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరు. అంతేకాదు దేశంలో అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందారు. 

నీతా అంబానీ తన ఫిట్‎నెస్ విషయంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నార. 60ఏళ్ల వయస్సులో 30ఏళ్లలా కనిపించడం వెనకున్న రహస్యం ఏంటి. 

నీతా అంబానీ 90కిలోల బరువు నుంచి 50 కిలోలకు తగ్గారు. ఆమెకు 60ఏళ్లు అంటే నమ్మశక్యం కాదు 

ప్రతిరోజూ 40 నిమిషాలు యోగాతోపాటు వ్యాయామం చేస్తుంటారు. స్విమ్మింగ్ కోసం సమయం కేటాయిస్తారు. తన బాడీని మెయింటెయిన్ చేసుకునేందుకు వీటిని అస్సలు మిస్ చేసుకోరు. 

నీతా అంబానీ మంచి డ్యాన్సర్. చిన్న వయస్సులోనే శాస్త్రీయ న్రుత్యం నేర్చుకున్నారు. అనేక భరతనాట్య ప్రదర్శనలు కూడా ఇచ్చారు. రెగ్యులర్‎గా డ్యాన్స్ ప్రాక్టిస్ చేస్తుంటారు. 

 డ్రై ఫ్రూట్స్‎తో తన రోజును ప్రారంభిస్తుంది. బీట్ రూట్ జ్యూస్ ఎక్కువగా తాగుతుంటారు. మధ్యాహ్నం భోజనంలో పచ్చికూరగాయలు, సూప్, మొలకలు తీసుకుంటారు. 

 ఇవన్నీ కూడా నీతా అంబానీ ఫిట్‎నెస్ రహస్యాలు.