కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. వ్యర్థాలు, విషాలను బయటికి పంపించే బాధ్యత కిడ్నీలదే.
ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర నిండిన ఆహారాలు తినడం తగ్గించాలి.
మూత్రపిండాలను జాగ్రత్తగా ఉండాలంటే సరైన ఆహారం తినాలి. సోడియం, పొటాషియం తక్కువగా, ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఉప్పు, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినకూడదు.
పండ్లు, బ్రోకలీ, క్యాబేజీ, పెరుగు, పాలు, బ్రౌన్ రైస్, ఓట్స్, చేపలు, బీన్స్ వంటి ఆహార పదార్థాలు కిడ్నీలకు ఎంతో మేలు చేస్తాయి.
అరటి పండ్లు, పుల్లని పండ్లు, బంగాళాదుంపలు, అవకాడోలు వంటివి మూత్ర పిండాల కోసం తినకూడదు.
సోడియం అధికంగా ఉన్న ఆహారాలను తినకూడదు. ఉప్పగా ఉన్న ఆహారాలలో సోడియం అధికంగా ఉంటుంది.
అలాగే ఊరగాయలు, నిల్వ పచ్చళ్లు వంటి వాటిలో కూడా సోడియం అధికంగా ఉంటుంది.
చక్కెర నిండిన పానీయాలు తినకూడదు. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలను తినడం తగ్గించాలి.