ఉదయం లేవగానే హుషారుగా ఉండాలంటే..

మీరు ఉదయం  మేల్కొనే విధానం మీ రోజును   నిర్ణయిస్తుంది. మంచి రోజు కావాలంటే మన మానసిక,  శారీరక ఆరోగ్యం బాగుండాలి.

ఉదయం నిద్ర లేవగానే నీరసంగా అనిపిస్తుందని చాలా మంది చెబుతుంటారు. నిద్రలో ఉండే నీరసం నిద్ర లేవగానే మరింత ఎక్కువగా ఉంటుందన్న ఫీలింగ్ కూడా ఉంది.

ఈ సమస్యను నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఉదయం అలవాట్లు మీ మనస్సు, శరీరాన్ని ఉత్తేజపరచడంలో సహాయపడతాయి.

రాత్రి నిద్ర తర్వాత శరీరం తేమను కోల్పోతుంది. కాబట్టి మీ రోజును ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా ప్రారంభించండి. కావాలనుకుంటే, ఈ నీటిలో నిమ్మరసం మరియు తేనె కలపవచ్చు.

శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి బాదం ఉత్తమమైన ఆహారం.  బాదంపప్పును రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే తీసుకోవడం వల్ల మీ శరీరం రోజంతా చురుకుగా ఉంటుంది.

ఉదయం పూట ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ఉదయం భోజనంలో గుడ్లు, పెరుగు, బాదం స్మూతీ వంటి ఆహారాలను చేర్చండి.

ఆహార పదార్థాల్లో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇది శరీర బలాన్ని పెంచుతుంది.

నిద్ర లేవగానే మొబైల్ వాడే అలవాటు మానేయండి. ఉదయం నిద్రలేచిన వెంటనే మొబైల్ ఫోన్ వాడే అలవాటు  మీ కంటి మరియు మానసిక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది.

మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా సాధన తప్పనిసరి. కాబట్టి ఉదయం నిద్రలేచిన వెంటనే యోగా కోసం కొంత సమయం కేటాయించండి.

బరువు తగ్గడానికి మాత్రమే వ్యాయామం చేయాలని అనుకోకండి. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల శరీరాన్ని అప్రమత్తంగా ఉంచుతుంది.

మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే, మీ గది కిటికీ కర్టెన్లను తెరవండి. ఇది మీ గదిని ప్రకాశవంతం చేస్తుంది - మిమ్మల్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.