ఇంట్లో ఏసీ పాడైపోయే ముందు కొన్ని సంకేతాలను ఇస్తుంది.
ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే ఏసీ పేలిపోయి ప్రాణ హాని జరిగే ప్రమాదం ఉంది.
ఏసీనీ సర్వీస్ చేయించకుండా ఎక్కువ కాలం వాడడం ద్వారా.. దాంట్లో దుమ్ము, దూళి ఏర్పడుతుంది.
దీని కారణంగా AC కంప్రెసర్‌పై ఒత్తిడి ఏర్పడి .. సాధారణకంటే ఎక్కువ శబ్దం చేయడం ప్రారంభిస్తుంది.
ఇది ఏసీ పాడైపోతుంది అనడానికి సంకేతం.
ఏసీ బాడీ వేడిగా ఉన్నట్లు అనిపించడం ప్రారంభిస్తే జాగ్రత్తగా ఉండండి.
వేడి కారణంగా ఏసీ నుంచి వచ్చే అదనపు వేడి.. అగ్ని లేదా పేలుడుకు కారణమవుతుంది.
AC నుంచి సరిగ్గా గాలి రాకపోవడం. ఇలాంటి పరిస్థితిలో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏసీ కంప్రెసర్‌లో సమస్య ఉందని తెలిపే సంకేతం.
ఈ సమయంలో ఏసీనీ అతిగా వాడడం ద్వారా పేలిపోయే ప్రమాదం ఉంటుంది.