వివో నుంచి 200MP కెమెరా ఫోన్‌ మావా.. ఫీచర్లు చూస్తే..!

స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ వివో తన లైనప్‌లో ఉన్న Vivo V60eను ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.

ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 7న భారతదేశంలో లాంచ్ అవుతుందని Vivo ఒక ప్రకటనలో ప్రకటించింది.

Vivo V60e అతిపెద్ద హైలైట్ దాని 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. ఈ విభాగంలో భారీ కెమెరాతో వచ్చిన మొదటి ఫోన్ ఇదే అవుతుంది.

దీంతో పాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

అదనంగా ఇది పంచ్-హోల్ కటౌట్‌తో 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.

8GB + 128GB వేరియంట్ ధర రూ.34,999గా ఉంటుంది.

8GB + 256GB వేరియంట్ ధర రూ.36,999గా ఉంటుంది.

12GB + 256GB వేరియంట్ ధర రూ.38,999గా కంపెనీ నిర్ణయించింది.

ఈ ఫోన్ ఎలైట్ పర్పుల్, నోబుల్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుందని కంపెనీ వెల్లడించింది.