వివో మామ ఇచ్చిపడేశాడు బ్రో.. కొత్త ఫోన్ భలే ఉంది మచ్చా..!

వివో తన లైనప్‌లో ఉన్న మరో అదిరిపోయే Vivo V60 Lite 5Gను తైవాన్‌ మార్కెట్‌లో విడుదల చేసింది.

8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 38,000గా ఉంది.

12GB + 256GB వేరియంట్ ధర రూ. 41,000గా కంపెనీ నిర్ణయించింది.

6.77-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌ను కలిగి ఉంది.

Android 15 ఆధారంగా Funtouch OS 15పై నడుస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.

వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి.

ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32-మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో కనెక్టివిటీ కోసం Wi-Fi, బ్లూటూత్, GPS, OTG, USB టైప్-C పోర్ట్ ఆప్షన్‌లు ఉన్నాయి.

90 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,500 mAh బ్యాటరీని కలిగి ఉంది.