Vivo T4 5G స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత దేశంలో లాంచ్ కానుంది. భారతదేశంలో ఏప్రిల్ 22న లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది.
ఇది గ్రీన్, గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ చాలా స్లిమ్ బెజెల్స్‌తో కూడిన క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఫ్లిప్‌కార్ట్, వివో ఇ-స్టోర్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా సేల్‌కు అందుబాటులోకి రానుంది.
ఈ T4 5G స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల పూర్తి AMOLED క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
120 Hz రిఫ్రెష్ రేట్ అందించారు. దీనిలో ప్రాసెసర్‌గా స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 అందించే అవకాశం ఉంది.
సేఫ్టీ కోసం స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు
50mp సోనీ ప్రైమరీ కెమెరా, 2mp సెకండరీ కెమెరా ఉంది. ముందు భాగంలో 32mp కెమెరాను అందించారు.
ఇది పెద్ద బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతును కలిగి ఉంటుంది.