పెంపుడు జంతువులంటే  చాలా మందికి విపరీతమైన ఇష్టం. 

పెట్ లవర్స్, మనుషులకంటే జంతువులనే ఎక్కువగా ప్రేమిస్తారు. 

వారి పెట్స్ పై విపరీతమైన ఆప్యాయత,  ప్రేమ చూపిస్తుంటారు. తమ పిల్లలతో సమానంగా చూసుకుంటారు. 

అయితే తాజాగా ఓ మహిళ తన పెంపుడు కుక్క పై చూపిన ప్రేమను చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. 

ఆమె తన పెంపుడు కుక్కకు ఏకంగా రూ.2.5 లక్షల విలువైన బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చింది. 

ఆమె తన పెంపుడు కుక్కకు ఏకంగా రూ.2.5 లక్షల విలువైన బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చింది. 

ముంబైలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

ముంబైకి చెందిన సరితా సల్దాన్హా అనే మహిళ తన పెట్ డాగ్ బర్త్ డే కానుకగా 2.5 లక్షల విలువైన బంగారు గొలుసును కుక్క మెడలో వేసింది. 

ఈ విషయాన్ని ఆ నగల వ్యాపారి తన సోషల్ మీడియాలో  పంచుకున్నాడు.