విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

వీరిద్దరూ తమ సంబంధాన్ని వెల్లడించనప్పటికీ.. తరచుగా కలిసి కనిపిస్తూ వార్తలను నిజం చేస్తుంటారు.

తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకున్నట్లుగా ఉన్న కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఈ ఫోటోలు చూసి చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోయారు.

నిజంగానే వీరు పెళ్లి చేసుకున్నారా? అని కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు మాత్రం ఇది AI ఫొటోలు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ ఫోటోలలో విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన్న వధూవరులుగా సాంప్రదాయ దుస్తులలో కనిపించారు.

వారి మెడలో దండలు, రష్మిక నుదుట సిందూరం, విజయ్ షేర్వాణీ వంటివి పెళ్లి వాతావరణాన్ని తలపించేలా ఉన్నాయి.

ఈ ఫోటోలు చూసి చాలా మంది అభిమానులు వీరు నిజంగానే పెళ్లి చేసుకుంటే బాగుండు అని కోరుకుంటున్నారు.

మొత్తానికి విజయ్, రష్మిక పెళ్లి AI ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ప్రస్తుతం వీరిద్దరూ వేరు వేరు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.