ఒమేగా 3 ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్న బఠాణీలను తీసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.

అల్జీమర్స్, ఆర్థరైటీస్ వంటి జబ్బులు రాకుండా బఠాణీల్లోని పోషకాలు అడ్డుకుంటాయి. ఎముకల్ని కాపాడతాయి.

కొవ్వు శాతం తక్కువగా ఉన్న బఠాణీల్లో ప్రోటీన్, ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి... బరువు తగ్గాలనుకునేవారు... వీటిని అధికంగా తీసుకోవాలి.

బఠాణీల్లోని అధికమొత్తంలో ఉన్న ఫైటో న్యూట్రియెంట్స్... పొట్ట క్యాన్సర్‌ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి.

ఫ్లేవనాయిడ్స్, యాంటీయాక్సిడెంట్స్ కలిగిన బఠాణీలను తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా తయారవుతుంది.

ఫైబర్ అధికంగా ఉన్న బఠాణీలు తీసుకోవడం వల్ల రక్తసరఫరా సరిగ్గా జరుగుతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉంటుంది.

బీ1, బీ2, బీ3, బీ6 విటమిన్స్ కలిగిన బఠాణీలు తీసుకోవడం వల్ల గుండెసమస్యల ముప్పు నుంచీ తప్పించుకోవచ్చు.

కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో బాటు మలబద్ధకాన్నీ ఊబకాయాన్నీ నివారిస్తాయి. 

తరచూ జలుబూ జ్వరాలతో బాధుపడేవాళ్లు వీటిని సూపుల్లో వేసుకుని తీసుకుంటే మంచిదట.