నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతోంది.
రీసెంట్ గా యానిమల్ మూవీతో మరో హిట్ కొట్టిన ఈ బ్యూటీ ఖాతాలో ప్రస్తుతం 6 చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది.
రష్మిక అప్ కమింగ్ మూవీస్
బాలీవుడ్ భాయీజాన్ సల్మాన్ సరసన సికిందర్ సినిమాలో కనిపించనుంది.
తెలుగులో ఐకాన్ అల్లు అర్జున్ సరసన పుష్ప 2 సినిమాతో మరో సారి మ్యాజిక్ చేయడానికి సిద్ధంగా ఉంది.
విక్కీ కౌశల్‌కి జోడీగా ఛావా చిత్రంలో రష్మిక నటించనుంది.
ధనుష్-నాగార్జున కలిసి నటిస్తున్న 'కుబేర్' చిత్రంలో కూడా రష్మిక ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సమాచారం.
‘ది గర్ల్‌ఫ్రెండ్’ మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
'రాంబో' చిత్రంలో దేవ్‌మోహన్‌తో రష్మిక ప్రధాన పాత్రలో కనిపించనుంది.