కొద్దిగా వెల్లులిని తీసుకుని నీటితో కలిపి పేస్టులా చేయండి. ఆ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలు తలనొప్పి తగ్గుతుంది.

విటమిన్-C, D, B12, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకొవడం ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

గోరు వెచ్చని ఆవుపాలు సైతం తలనొప్పి నివారణిగా పనిచేస్తుందట.

ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి తగ్గుతుంది.

కొద్దిగా రాతి ఉప్పును చేర్చిన పాలను తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.

అల్లాన్ని నమిలినా సరే తలనొప్పి తగ్గుతుంది.

చందనం పౌడర్ పేస్టులా చేసుకుని తలకు రాసుకున్న మంచి ఉపశమనం ఉంటుంది. 

యాపిల్‌ పండుతో పాటు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తీసుకున్నా తలనొప్పి మటుమాయం అవుతుంది.

తలనొప్పిని తగ్గించడంలో యూకలిప్టస్ ఆయిల్ బాగా పనిచేస్తుంది.