ఈ రోజుల్లో  పిల్లలు మొబైల్ ఫోన్లకు ఎక్కువగా బానిసలవుతున్నారు. 

గంటల తరబడి ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ సమయాన్ని గడిపేస్తున్నారు.

ఇది పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 

పేరెంట్స్ పిల్లలను ఫోన్ కు దూరంగా ఉంచడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి 

పిల్లవాడు రోజంతా ఫోన్‌లో గేమ్‌లు ఆడుతూ ఉంటే, అతన్ని తిట్టడానికి బదులు ప్రేమగా వివరించండి. 

ఫోన్ వాడడం వల్ల  కలిగే ప్రతికూల పరిణామాల గురించి వారికి చెప్పండి. 

పిల్లలను వీలైనంత ఎక్కువగా ఆడుకోవడానికి బయటకు పంపడానికి ప్రయత్నించండి. ఇతర వినోద కార్యక్రమాలను ప్రోత్సహించండి. 

పిల్లలు తమ పెద్దలను చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు. వారి ముందు పేరెంట్స్ రోజంతా ఫోన్‌లో బిజీగా ఉంటే, మీ బిడ్డ కూడా మీ ప్రవర్తనను కాపీ చేస్తుంది. 

పిల్లలను బయటకు తీసుకెళ్లండి. వారితో కాసేపు ఆడుకోండి.

 పిల్లల స్క్రీన్ సమయాన్ని సెట్ చేయండి. 

ముఖ్యంగా రాత్రిపూట, భోజనం చేసేటప్పుడు, సాయంత్రం చదువుకునేటప్పుడు ఫోన్ వాడకాన్ని నిషేధించండి.