విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచే టిప్స్ ఇవే..!!

 By Bhoomi

పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం చాలా ముఖ్యం. ఇది వారి జీవితాన్ని మరింత అందంగా మారుస్తుంది. 

విద్యార్థులు తమ గురించి ప్రతికూలంగా మాట్లాడితే ఆ పద్దతిని మార్చండి. ఎప్పుడూ సానుకూలంగా మాట్లాడేలా వారిని ప్రోత్సహించండి. వారి ఆలోచనల శక్తిని అర్థం చేసుకోండి. 

నిర్దిష్టమైన కొలవగల, సమయానుకూలంగా సాధించే లక్ష్యాలను నిర్దారించుకునేందుకు విద్యార్థులకు మార్గనిర్దేశం చేయండి. 

 వారి భవిష్యత్తును రూపొందించేందుకు విద్యార్థుల పనిపై ఖచ్చితమైన చురుకైన సలహా, అభిప్రాయాన్ని అందించండి. తప్పులను తెలుసుకునేందుకు సహాయపడుతుంది. 

విద్యార్థుల్లో అభివ్రుద్ధి ఆలోచనలను ప్రోత్సహించండి. నిబద్ధత, క్రుషి ద్వారా బలం, జ్నానం అభివ్రుద్ధి చెందుతాయని బోధించండి. 

పాఠశాల గదిలో సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పరచండి. 

సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది పిల్లలను స్వతంత్రంగా ఆలోచించేలా ప్రోత్సహించండి. 

విద్యార్థులు చేసే పనులు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. కానీ ఆ పనిలో వారు చేసిన క్రుషిని గుర్తించండి. మరింత సాధించేందుకు ప్రేరేపించేలా చేస్తుంది

విద్యార్థులకు నాయకత్వ పాత్రలు పోషించే అవకాశాలను అందించండి.