బొజ్జ గణపయ్యకు నోరూరించే నైవేద్యాలు ఇవే..!!

 By Bhoomi

బొజ్జ గణపయ్యకు నైవేద్యాలు అంటే చాలా ఇష్టం.  

విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, గణేషుడు భోజన ప్రియుడు. 

వినాయక చవితి రోజు వినాయకుడికి నోరూరించే నైవేద్యాలు పెడితే ఆ గణపయ్య సంతోషిస్తాడట. 

వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మోదకం, కడుములు, లడ్డూలు, గుగ్గిల్లు పూజ సమయంలో నైవేద్యంగా సమర్పిస్తారు.  

వినాయకుడికి నైవేద్యం వండేప్పుడు 3,5,7,9 లెక్కల్లో వెరైటీలు చేయాలి. 

మీ ఓపిక, వీలును బట్టి గణనాథునికి నైవేద్యంగా అందించవచ్చు.  

శెనగపప్పు, బెల్లం, గోధమపిండితో చేసిన వంటకం చాలా ప్రసిద్ధి. 

పాల తాళికలు, రవ్వమోదకం, లడ్డూలు, రవ్వ లడ్డూలు, సేమియా పాయసం ఇలా పెట్టొచ్చు. 

గారెలు, మిరప పునుగులు, మైసూర్ బోండా, ఆలూ పకోడా, మసాల వడ, ఇలా ఎన్నో రకాలు నైవేద్యంగా సమర్పించవచ్చు.