యుఎఇలోని దుబాయ్‌లోని అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌గా అవతరించబోతోంది.
దుబాయ్‌లోని ఈ రెండో విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ సిద్ధమవుతోంది. 35 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రపంచంలోనే అతిపెద్ద టెర్మినల్ ఇది.
దుబాయ్‌కి దక్షిణాన ఉన్న ఎడారిలో వచ్చే 10 ఏళ్లలో విమానాశ్రయం సిద్ధం కానుంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటైన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్
దుబాయ్‌లో రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. 1. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) 2. అల్ మక్తూమ్ విమానాశ్రయం
దుబాయ్ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటి. ఏడాదిలో దాదాపు 9 కోట్ల మంది ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు.
అల్ మక్తూమ్ విమానాశ్రయం ఈ విమానాశ్రయానికి దక్షిణంగా 45 కి.మీ దూరంలో ఉంది. 2010లో ప్రారంభమైన దీనికి ప్రస్తుతం ఒక టెర్మినల్ - రెండు రన్‌వేలు ఉన్నాయి.
ప్రస్తుత ప్రాజెక్ట్‌లో, అల్ మక్తూమ్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ సిద్ధమవుతోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టెర్మినల్ అవుతుంది.
ఈ విమానాశ్రయానికి 400 ఫ్లైట్ గేట్లు ఉంటాయి. అలాగే, ఐదు ప్రత్యామ్నాయ రన్‌వేలను నిర్మిస్తున్నారు.
ఇది పూర్తిగా సిద్ధమైతే, కొత్త విమానాశ్రయం ప్రస్తుతం ఉన్న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఇది రెండున్నర కోట్ల మందికి పైగా ప్రయాణికులకు సేవలందించేంత భారీగా ఉంటుంది.
ప్రపంచంలోనే తొలిసారిగా ఈ విమానాశ్రయం నిర్మాణంలో కొత్త ఏవియేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. విమానాశ్రయం చుట్టూ నగరాన్ని కూడా నిర్మిస్తున్నారు. చుట్టూ లక్షలాది ఇళ్లు నిర్మించనున్నారు.