పాముల గురించి చాలా అపోహలు ఉంటాయి. వాటిలో ఒకటి పగబట్టిన వారిని చంపుతాయని నమ్మడం
అయితే తాజాగా యూపీలోని ఫతేపూర్ జిల్లాలో ఇలాంటి ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
వికాస్ దూబే అనే వ్యక్తిని 35 రోజుల గ్యాప్ లో పాము 6 సార్లు కాటేసింది.
దాంతో ఆ యువకుడు ప్రాణాలు కాపాడుకోవడానికి భయపడి మేనత్త ఊరికి వెళ్ళాడు.
అయితే పాము కూడా ఆ ఊరికి వెళ్లి మళ్ళీ అతన్ని ఏడో సారి కాటేసిందట
కాటేసిన ప్రతీసారి వెంటనే వైద్యం అందించడంతో అతను బతికి బయటపడ్డాడు
కాటేసింది ఒకటే సర్పమా..? లేదా వేర్వేరు పాములా తెలియాల్సి ఉంది.
నిజంగా పాములు పగ పడతాయా? దీనికి సైన్స్ ఏంచెబుతుంది?
పాములు ప్రతీకారం తీర్చుకుంటాయనే వాదనకు శాస్త్రీయ ఆధారం లేదు.
ఎందుకంటే పాములకు జ్ఞాపకశక్తి చాలా తక్కువ. అవి వ్యక్తిని గుర్తుపెట్టుకొని దాడి చేయలేవు
35 రోజుల్లో ఆరుసార్లు పాము కాటుకు గురికావడం కేవలం యాదృచ్చికమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.