ప్రపంచంలోనే అందమైన నది..5రంగుల్లో నీరు కనిపిస్తుంది.

కానో క్రిస్టల్స్ నదిలో అందమైన ఎన్నో కొలనులు ఉన్నాయి. ఈ రాళ్లు నది అందాన్ని మరింత పెంచుతాయి. 

ఈ నది కొలంబియా గుండా ప్రవహిస్తుంది. ఈ నది ఐదు రంగుల నది అని పిలుస్తారు. 

జులై నుంచి నవంబర్ వరకు ఈ నది రంగురంగులుగా కనిపిస్తుంది. ఇతర మాసాల్లో మిగిలిన నదుల వలె కనిపిస్తుంది.

మకరేనియా క్లావిగ్రా మొక్కలు వేసవి నుంచి వర్షాకాలం వరకు ఈ నదిలో పెరుగుతాయి. అందుకే ఈ నది ఐదు రంగుల్లోకనిపిస్తుంది. 

ఈ నది పొడవు 100కిలోమీటర్లు ఉంటుంది. దాని వెడల్పు 20 మీటర్లు ఉంటుంది. 

ఈ నది చూడటం అంత సులభం కాదు. కొలంబియా అడవిలో ఉన్న ఈ నదికి చేరుకోవాలంటే పడవల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది.