గ్రహాంతర వాసుల గురించి వింటూనే ఉన్నాం. ఎప్పటి నుంచో ఎక్కడో అక్కడ వీటికి సంబంధించిన కథలు వినిపిస్తూనే వస్తున్నాయి.
గ్రహాంతర వాసులు- UFOల గురించి ప్రపంచవ్యాప్తంగా వివిధ వాదనలు ఉన్నాయి.
కొంతమంది గ్రహాంతరవాసులు ఉన్నారని, వారు సుదూర విశ్వంలో ఎక్కడో నివసిస్తున్నారని నమ్ముతారు.
ఎప్పుడైనా ఏదో ఒక రహస్యమైన కాంతి లేదా ఏదైనా రహస్యమైన వస్తువు ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తే, అది గ్రహాంతరవాసులకు సంబంధించింది ఏమో అని అంతా అనుకుంటారు.
స్పెయిన్‌లో ఆకాశంలో ఒక రహస్యమైన నీలిరంగు కాంతి కనిపించింది అక్కడ చాలా మంది ఈ కాంతిని చూశారు.
దానిని వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో రాత్రి సమయం కావడం, రోడ్డుపై వాహనాలు వస్తూ పోతూ ఉండడం, ఇంతలో ఆకాశం నుంచి భూమిపైకి ఏదో పడిపోవడం కనిపించింది.
'వీడియోలో కనిపిస్తున్న ఈ మర్మమైన వస్తువు బోలైడ్' అని కొందరు చెబుతున్నారు. బోలైడ్ నిజానికి ఒక రకమైన ప్రకాశవంతమైన ఉల్క, ఇది వాతావరణంలో పేలుతుంది' అని అంటున్నారు.
కొంతమంది మాత్రం 'అది గ్రహాంతర వాసి. హాయ్ చెప్పడానికి భూమికి వచ్చాడు.’ అని చాలామంది సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ షాకింగ్ వీడియో @dom_lucre అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో ఉంది. 13 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 5 మిలియన్ల మంది చూశారు.