ఆషాఢంలో తెలంగాణ ప్రజలు బోనాల పండగను ఘనంగా జరుపుకుంటారు.
మహిళలందరూ పసుపు, కుంకుమ, బోనాలు, పట్టు చీరలతో అమ్మవార్లను కొలుచుకుంటారు.
అయితే ప్రతీ
ఆషాఢంలో
బోనాల పండుగను ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాము
బోనాల పండుగ జరగడం వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి.
1908లో మూసీ వరదలతో హైదరాబాద్ అతలాకుతలం అయ్యిందంట.
దీంతో అప్పటి మహారాజు కిషన్ ప్రసాద్ వరదలు తగ్గితే..
లాల్ దర్వాజా అమ్మవారికి ప్రతి ఆషాఢ మాసంలో ఘనంగా పూజలు నిర్వహిస్తానని మొక్కారట
మరొకటి 1869లో హైదరాబాద్‌లో ప్లేగ్ వ్యాధి విజృంభన విపరీతంగా ఉండేంది.
దీంతో వ్యాధి ముప్పు తగ్గితే ఉజ్జెయినీ మహాంకాళి అమ్మవారికి గుడి కట్టిస్తామని జవాన్లు మొక్కుకున్నట్లు చెబుతుంటారు.
ప్లేగ్ వ్యాధి తగ్గడంతో అమ్మవారికి గుడి కట్టించి ఘనంగా బోనాల ఉత్సవాలు జరిపించారట.
అప్పటి నుంచి ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవార్లకు బోనాల ఉత్సవాలు జరిపిస్తున్నట్లు సమాచారం.