ఈ ఏడాది టీమిండియా ఆడే ఇంటర్నేషనల్ సిరీస్ ఇవే

ఐపీఎల్ టోర్నీ ముగిసింది. ఇక టీమిండియా వేర్వేరు సిరీస్ లలో పాల్గోబోతోంది

జూన్ లో T20 ప్రపంచ కప్ పోటీలతో టీమిండియా ఈ సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. టీమిండియా ఈ ఏడాది షెడ్యూల్ ఇక్కడ ఉంది.

T20 ప్రపంచ కప్ 2024: T20 ప్రపంచ కప్ జూన్ 2 నుండి జూన్ 29 వరకు వెస్టిండీస్-అమెరికా వేదికగా జరుగుతుంది.

భారత్ vs జింబాబ్వే: టీ20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టు  జూలై 6 నుంచి -  జూలై 14 వరకూ  జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది.

భారత్ vs శ్రీలంక: శ్రీలంకతో టీమిండియా  జూలై-ఆగస్టు నెలలో 6 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో ఇరు జట్లు శ్రీలంకలో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి.

భారత్ vs బంగ్లాదేశ్: స్వదేశంలో సెప్టెంబర్ నెలలో బంగ్లాదేశ్‌తో భారత జట్టు 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది.

భారత్  vs న్యూజిలాండ్: అక్టోబర్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ సిరీస్‌కి కూడా భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది.

భారత్ vs ఆస్ట్రేలియా: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ నవంబర్-డిసెంబర్‌లో జరగనుంది, ఆస్ట్రేలియాలో జరగనున్న ఈ  సిరీస్‌లో రెండు జట్లు మొత్తం 5 టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి.

ఇండియా vs ఇంగ్లండ్: 2025లో భారత్ తమ తొలి సిరీస్‌ని జనవరి-ఫిబ్రవరి మధ్య ఇంగ్లండ్‌తో ఆడనుంది. భారత్‌లో జరగనున్న ఈ సిరీస్‌లో టీమిండియా 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025: ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి-మార్చిలో జరుగుతుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి.

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఏప్రిల్ - మేలో జరగనుంది.