టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా అద్భుత విజయం సాధించింది.
17 ఏళ్ల తర్వాత టీ-20 వరల్డ్‌కప్ అందుకున్న సందర్భంగా ముంబైలో టీమిండియా ఓపెన్ బస్ పరేడ్ నిర్వహిస్తున్నారు
ముంబై చేరుకున్న టీమ్ ఇండియాకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు సాగనున్న ఈ ఓపెన్ బస్ పరేడ్ కు భారీగా అభిమానులు తరలివచ్చారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా లక్షలాదిగా వచ్చిన అభిమానులతో ముంబై మహానగరం కిక్కిరిసింది.
ఎయిర్పోర్ట్ నుంచి నారీమన్ పాయింట్ కు క్రికెటర్లు బయలుదేరారు.
అక్కడ ఈ విక్టరీ పరేడ్ తర్వాత దేశానికి కప్ తీసుకువచ్చిన భారత క్రికెటర్లను బీసీసీఐ ఘనంగా సన్మానించనుంది.