శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ముఖంలో ఈ మార్పులు కనిపిస్తాయి.
మొహం పసుపు రంగులో కనిపిస్తుంది. రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల ఇలా జరుగుతుంది.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడమే దీనికి కారణం. చెడు కొలెస్ట్రాల్ రక్త ప్రసరణను అడ్డుకుంటుంది.
మొహం పై చిన్న చిన్న గడ్డలు కనిపిస్తాయి. సాధారణంగా కళ్ల చుట్టూ ఏర్పడే ఈ గడ్డలు అధిక చెడు కొలెస్ట్రాల్ కు సంకేతం.
చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, కళ్ల చుట్టూ లేత పసుపు రంగు దద్దుర్లు కొన్ని చిన్న పసుపు మొటిమలు కనిపిస్తాయి.
ముఖం మీద వాపు రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు, కానీ కొన్నిసార్లు చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కూడా ఈ వాపు వస్తుంది.
దీని వల్ల ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది. లేదా చర్మం పూర్తిగా పొడిబారుతుంది.
ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ఈ సమస్యను నియంత్రించవచ్చు.