సూపర్ బ్లూ మూన్: ఈ రోజు చందమామ ఎలా కనిపిస్తాడో తెలుసా? 

 By Bhoomi

 ఈ రోజు విశ్వంలో అద్భుతం చోటుచేసుకోనుంది. సూపర్ బ్లూ మూన్ ఈరోజు కనువిందు చేస్తాు. ఈఏడాదిలో మూడవ అతిపెద్ద చంద్రుడు కనిపించబోతున్నాడు.  

ఈ రోజు కనిపించే చంద్రుడు పరిమాణంలో 7 రెట్లు పెద్దగా కనిపించనున్నాడు. దీంతోపాటు చంద్రుడు ఈరోజు ప్రకాశవంతంగా కనిపిస్తాడు. 

ఈ రోజు ఆరేంజ్ కలర్ చంద్రుడు కనిపిస్తాడు. కానీ బ్లూమూన్ అని ఎందుకు పిలుస్తారు? . 

పేరుతో సంబంధం లేనప్పటికి చంద్రుడు ఈ రోజు తెలుపు, ఆరేంజ్, ఎల్లో కలర్స్ లో కనిపిస్తాడు

ఎరుపు కాంతిని ఫిల్టర్ చేసే అంశాలు గాలిలో ఉన్నప్పుడు చందమామ బ్లూ కలర్ లో కనిపిస్తాడని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. 

సూపర్ మూన్ ను చూడటం ఇదేమీ అరుదైన సంఘటన కాదు. ఇలా ఏడాదికి రెండు నుంచి నాలుగు సార్లు జరుగుతుంది. కానీ బ్లూ మూన్ కనిపించడం నిజంగానే అద్భుతం. 

 బ్లూ సూపర్ మూన్ ప్రతి పదేళ్ల నుంచి ఇరవైఏళ్లకు కనిపిస్తుంది. నాసా ప్రకారం తర్వాతి బ్లూ మూన్ 2037లో కనిపిస్తుంది. 

చంద్రుడు నీలం రంగులో కనిపించడం అసాధారమైనప్పటికి, క్రాకటోవా అగ్నిపర్వత విస్పోటనం కారణంగా ఇది 1883లో జరిగింది.