వేసవిలో ఎక్కువగా వచ్చే డీ హైడ్రేషన్, అలసట, చర్మ సమస్యలతో ఇబ్బందిపడేవారికి తాటి ముంజులు మంచి ఔషదం.

వీటిని ‘ఐస్ యాపిల్స్’ అని కూడా అంటారు

ఈ ముంజుల్లో విటమిన్‌ ఏ, బీ, సీ, ఐరన్‌, కాల్షియంతోపాటు బి కాంప్లెక్స్, నియాసిస్, రిబో ప్లెవీస్, దయామిన్, జింకు పాస్పరస్, పొటాషియం తదితర పోషకాలు కూడా ఉంటాయి.

కాలేయ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ముంజుల్లోని పొటాషియం శరీరంలో ఉండే విష పదార్ధాలను తొలగిస్తాయి.

తాటి ముంజులు లేతగా ఉంటే తప్పకుండా దానిపై ఉండే తొక్కతో తినేయండి. ఎందుకంటే అసలైన పోషకాలన్నీ అందులోనే ఉంటాయి.

జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారికి ఇవి మేలు చేస్తాయి. 

వడదెబ్బ తగిలినవాళ్లకు ముంజులను జ్యూస్‌గా చేసి పట్టిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. 

దద్దుర్లు, కాలిన గాయాలు, చేమట కాయలు ఏర్పడినట్లతే తాటి ముంజుల గుజ్జుని శరీరానికి పట్టించి చూడండి. కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి.

ఇవి బీపీని అదుపు చేయడమే కాకుండా కొవ్వును కంట్రోల్ చేస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఎముకులను బలంగా ఉంచేందుకు, వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ముంజులు చాలా మంచివి.