ధనం: మనం డబ్బును లక్ష్మీదేవితో కొలుస్తాం. సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ ఇంటి నుంచి లక్ష్మీదేవిని బయటకు పంపిసినట్లే.

పాలు: సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా మనం పాలు ఇస్తే ఆ లక్ష్మీదేవికి కోపం వస్తుందట. వారి వృద్ధి ఆగిపోయినట్లేనట.

పెరుగు: సూర్యాస్తమయం తర్వాత పెరుగు ఎవరికైనా ఇస్తే ఆ కుటుంబంలో సంతోషం, శోభ తగ్గిపోతాయట.

పసుపు:సూర్యాస్తమయం తర్వాత పసుపును ఎవరికైనా ఇచ్చారంటే.. ఆ కుటుంబసభ్యులకు ఆరోగ్య, ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందట.

ఉల్లిపాయ, వెల్లులిపాయ: ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ.. సాయంకాలం ఎవరికీ వీటిని కూడా ఇవ్వకూడదు. ఇస్తే మాత్రం కష్టాలు తప్పవు.

సూర్యోదయం తరువాత, సూర్యాస్తమయం సమయంలో అస్సలు పడుకోకూడదు.

సాయంత్రం సమయంలో ఇంట్లో చెత్తను శుభ్రం చేయకూడదని పెద్దవారు చెబుతూ ఉంటారు.ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కలత చెందుతుందని చెబుతూ ఉంటారు.

సూర్యాస్తమయం తర్వాత గోర్లు, జుట్టు అసలు కత్తిరించకూడదు.

ముఖ్యంగా మహిళలు కాని పురుషులు కాని సాయంత్రం వేళ ఇంటి గుమ్మం మీద కూర్చోకూడదు అలా చేయడం ఆ ఇంటికి అశుభం అని భావిస్తారు.

సూర్యాస్తమయం తర్వాత తులసి చెట్టు ను ఏ విధంగా తాగడం అశుభం గా పరిగణిస్తారు ఈ సమయంలో తులసి మొక్కకు నీటిని కూడా పోయకూడదు.