చాలా మందికి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ పానీపూరీ

బయ్యా.. తోడ ప్యాజ్ ధాలో, బయ్యా తోడ పాణి ధాలో అంటూ లొట్టలేసుకుంటూ తింటారు. 

మీరు కూడా ఈ కోవకు చెందిన వారైతే ప్రమాదంలో ఉన్నట్లే ..!

తాజాగా పానీపూరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన స్టడీలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.

పానీపూరీ, వాటి సాస్‌, స్వీట్‌ చిల్లీ పౌడర్లలో క్యాన్సర్‌ కారక రసాయనాలు ఉన్నట్టు తేలింది. 

చాలా వరకు సాంపిల్స్ లో యెల్లో, బ్రిలియంట్‌ బ్లూ, కార్మోసిన్‌ వంటి సింథటిక్‌ రంగులు ఉన్నట్టు గుర్తించారు. 

కృత్రిమ రంగుల వలన అలర్జీ, పిల్లల్లో హైపర్‌ యాక్టివిటీ, అరుగుదల వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 

ఎక్కువ కాలం ఈ సింథటిక్‌ రంగులను తీసుకోవడం వల్ల క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.