వంటగదిలో పని చేస్తున్నప్పుడు తరచుగా బట్టల పై నూనె, మసాలా మరకలు పడుతుంటాయి.
ఈ మొండి మరకలు సాధారణ డిటర్జెంట్ తో ఎంత రుద్దినా పోవు.
బట్టల పై ఇలాంటి జిడ్డు మరకలు తొలగించడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
నూనె మరకలను తొలగించడానికి నిమ్మకాయ రసాన్ని మరకల పై వేసి రుద్దండి.
టాల్కమ్ పౌడర్ కూడా బట్టలపై నూనె మరకలను తొలగించడానికి సహాయపడుతుంది.
మరకలు పడిన బట్టల పై టాల్కమ్ పౌడర్ 20 నుంచి 30 నిమిషాలు ఉంచండి .
టాల్కమ్ పౌడర్ బట్టల పై పడిన నూనెను పూర్తిగా పీల్చుకుంటుంది.
ఆ తర్వాత డిటర్జెంట్ వేసి బట్టలను శుభ్రంగా క్లీన్ చేయండి. ఆ తర్వాత డిటర్జెంట్ వేసి బట్టలను శుభ్రంగా క్లీన్ చేయండి.
బట్టలపై నూనె, మసాలా మరకలను శుభ్రం చేయడంలో బేకింగ్ సోడా కూడా బాగా సహాయపడుతుంది.
మరక పడిన ప్రదేశాన్ని తడిపి దాని పై బేకింగ్ సోడా అప్లై చేయండి. బేకింగ్ సోడా నూనె మరకలను పూర్తిగా పీల్చుకుంటుంది.