Sony నుంచి పిచ్చెక్కించే స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు మైండ్ బ్లోయింగ్ భయ్యా..!

సోనీ అధికారికంగా Sony Xperia 10 VIIని విడుదల చేసింది.ఈ స్మార్ట్‌ఫోన్ వైట్, టర్కోయిస్, చార్‌కోల్ బ్లాక్ వంటి కలర్‌ ఆప్షన్లలో లభిస్తుంది.

ఈ ఫోన్ ప్రస్తుతం యూరప్‌లో అందుబాటులో ఉంది. ఈ నెలలో UKలో అందుబాటులో ఉంటుంది.

అయితే ఈ Xperia 10 VII త్వరలో భారత మార్కెట్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఇది 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేను పూర్తి HD + రిజల్యూషన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది.

ఈ ఫోన్‌లో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 3 ప్రాసెసర్ అందించారు. 5,000mAh బ్యాటరీతో వస్తుంది.

Sony Xperia 10 VII ఫోన్‌లో 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించవచ్చు.

వెనుక భాగంలో 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి.

సెల్ఫీ, వీడియో కాల్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఇది పూర్తి ఎన్‌క్లోజర్ డిజైన్‌తో స్టీరియో ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్‌లను కూడా కలిగి ఉంది.

ఇందులో సేఫ్టీ కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించారు.

వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IPX5/IPX8, IP6X రేటింగ్‌‌తో వస్తుంది.