ఆపిల్ మాత్రమే కాదు రోజుకో అరటి పండు తిన్నా ఆరోగ్యంగా జీవించొచ్చు.
అన్ని సీజన్లలో లభించే అరటి పండ్లను ఎక్కువగా తినడం ద్వారా అనేక రోగాల నుంచి బయటపడొచ్చు.
మెగ్నీషియంలోపాటు మాంగనీస్, రాగి, బయోటిన్ సమృద్ధిగా ఉంటాయి
గోదుమ రంగు మచ్చలు ఉండే అరటి పండులో తగిన పోషకాలు ఉంటాయి.
అరటి పండులో ఉండే పోషకాలు అధిక రక్తపోటు, మధుమేహం, ఆస్థమా, క్యాన్సర్, అజీర్తి, జీర్ణ సమస్యలను నిరోధిస్తుంది.
ఎముకలు, దంతాలకు మంచిది. కిడ్నీల ఆరోగ్యానికి కూడా ఇది ఉపకరిస్తుంది.
రోజుకో అరటి పండు తినడం ద్వారా ఆస్తమా లక్షణాలు తగ్గుముఖం పడతాయి
బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా అరటిపండు తినండి.