లేడీ కోహ్లీగా అభిమానుల మనసు దోచుకున్న క్రికెటర్ స్మృతి మంధానా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.
లేడీ కోహ్లీగా అభిమానుల మనసు దోచుకున్న క్రికెటర్ స్మృతి మంధానా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ సంగీత దర్శకుడు సింగర్, డైరెక్టర్, యాక్టర్.. అన్నిటికంటే ముఖ్యంగా తన ప్రియుడు పలాష్ ముచ్చలను ఆమె వివాహం చేసుకోబోతుంది.
వీరిద్దరి వివాహం వచ్చే నెల అంటే నవంబర్ 20వ తేదీన అంగరంగ వైభవంగా జరగనుందని తెలుస్తోంది.
స్మృతి స్వస్థలమైన మహారాష్ట్రలోని సాంగ్లీలో జరగనున్నట్లు సమాచారం.
ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వివాహానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్.. ఇరు కుటుంబాల నుంచి ఇంకా రానప్పటికీ.. పెళ్లి తేదీ మాత్రం ఇప్పుడు జోరుగా వైరల్‌గా మారింది.
వీరిద్దరూ గత కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. దాదాపు 2019 నుంచి సీక్రెట్‌గా లవ్ చేసుకుంటున్నట్లు సమాచారం.
చాలా సార్లు బయట కెమెరాలకు చిక్కడంతో వీరి ప్రేమ వ్యవహారం బయటపడింది.
ఇటీవలే పలాష్ ముచ్చల్ పరోక్షంగా స్మృతితో తన వివాహాన్ని వెల్లడించారు.
‘‘స్మృతి త్వరలోనే ఇండోర్ కోడలు కాబోతోంది’’ అని మీడియాకు తెలియజేశారు.