ఈ మధ్య జుట్టు రాలడం చాలా మందిలో పెద్ద సమస్యగా మారింది.

ఒత్తిడి, ఆందోళన, జీవనశైలి దీనికి ప్రధాన కారణాలు. 

అయితే యోగాతో జుట్టురాలడాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు నిపుణులు.

యోగా ఒత్తిడి, ఆందోళనను తొలగిస్తుంది. ఇది హార్మోన్ల అసమతుల్యత సమస్యను కూడా తొలగిస్తుంది.

దీని వల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది.

జుట్టురాలే సమస్యను తగ్గించే యోగాసనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము.

కపాలభతి ప్రాణాయామం ఒత్తిడి , ఆందోళనను తొలగించడంలో సహాయపడుతుంది

అధో ముఖస్వనాసన..ఇది  తలలో రక్త ప్రసరణ పెంచుతుంది. దీని వల్ల వెంట్రుకల కుదుళ్లు దృఢంగా మారతాయి. 

సర్వగాసన.. ఇది హార్మోన్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది. తద్వారా జుట్టు రాలడం నుంచి ఉపశమనం పొందుతారు.

బలాసన.. ఒత్తిడి కారణంగా జుట్టు రాలిపోయే వ్యక్తులు బలాసనం చేయడం వల్ల మేలు జరుగుతుంది.

వజ్రాసనం.. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి జుట్టుకు సరైన పోషణను అందిస్తుంది.