ఈ మధ్య కాలం ఎక్కడ చూసిన కల్తీ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. 

ఆహరంతో పాటు వాడే వంట నూనెతో సహా అన్నిటిలోనూ కల్తీ జరుగుతోంది. 

అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో వంట నూనెలో కల్తీని కనిపెట్టవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము 

ఒక తెల్ల కాగితం తీసుకొని దాని పై కొద్దిగా  వేసి కాసేపు ఆరబెట్టాలి. 

నూనె స్వచ్ఛమైనది అయితే.. వృత్తంలా వ్యాపిస్తుంది. ఒకవేళ నూనెలో కల్తీ  జరిగితే ఇంకిపోకుండా పక్కకు జారిపోవడం మొదలవుతుంది. 

నూనెలో కల్తీని కనిపెట్టడానికి మరొక మార్గం.. ఒక గిన్నెలో కొంచెం నూనె పోసి ఫ్రీజర్‌లో ఉంచాలి. 

 స్వచ్ఛమైన నూనె అయితే  గడ్డకడుతుంది. కల్తీ నూనె ద్రవరూపంలో ఉండిపోతుంది. 

వాసనతో కూడా నూనెలో కల్తీని గుర్తించవచ్చు. కల్తీ నూనె చేదు వాసన వస్తుంది. అలాగే చిక్కగా ఉంటుంది.