ఈ రోజుల్లో సోషల్ మీడియా వినియోగం సర్వ సాధారణమైంది.

చాలా మంది టైంతో సంబంధం లేకుండా 24 గంటలు ఫోన్లతోనే గడిపేస్తున్నారు.

ఇలా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయి.

అయితే ఫోన్ అడిక్షన్ నుంచి దూరంగా ఉండడానికి ఇలా చేయండి.

ప్రతీ రోజూ వ్యాయామం, యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత ఉంటుంది.

బుక్స్ చదవడం, పెయింటింగ్ వంటి సృజనాత్మక విషయాల పై టైం స్పెండ్ చేయండి.

సోషల్ మీడియాలో వచ్చే ప్రతీది చూడాల్సిన పనిలేదు. మీకు అవసరమైనది మాత్రమే చూడడం మంచిది.

రోజులో ఫోన్ చూడడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోండి. అంతకు మించి యూజ్ చేయకండి.

ఇలా చేయడం వల్ల కొంత వరకు ఫోన్ నుంచి ద్రుష్టి మారుతుంది.