సాధారణంగా ఆఫీస్ లేదా స్కూల్ కు వెళ్ళే
టప్పుడు ఫుడ్ ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ లంచ్ బాక్సులను ఉపయోగిస్తుంటాము.
అయితే కొన్ని రోజుల తర్వాత అవి పసుపు రంగులోకి మారడం, వాటి నుంచి కూరగాయల వాసన రావడం మొదలవుతుంది.
ప్లాస్టిక్ బాక్స్ ల నుంచి దుర్వాసన తొలగించి ఎల్లప్పుడూ తాజాగా ఉండడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
నిమ్మకాయ, ఉప్పు కలిపిన నీటిని బాక్స్ లో పోసి కాసేపు ఉంచండి. ఆ తర్వాత స్క్రబ్ తో క్లీన్ చేస్తే వాసన రాదు
బేకింగ్ సోడా కలిపిన నీటిని పదిహేను నిమిషాలు బాక్స్ లో ఉంచండి. ఆ తర్వాత స్క్రబ్ తో క్లీన్ చేయండి. తళతళ మెరిసిపోతాయి.
వెనిగర్ ద్రవాన్ని లంచ్ బాక్స్ లో 15 నిమిషాలు ఉంచి ఆ తర్వాత బాక్స్ శుభ్రం చేయండి. ఇది దుర్వాసనను తొలగిస్తుంది.
కాఫీ పౌడర్ తో ప్లాస్టిక్ బాక్స్ కాసేపు రుద్దిన తర్వాత.. 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత శుభ్రం చేయండి.