ఈరోజుల్లో ప్రతీ ఇంట్లో మెడిసిన్ ఉన్నా లేకపోయినా పారాసిటమాల్ టాబ్లెట్ మాత్రం కచ్చితంగా ఉంటుంది.
జ్వరం, తలనొప్పి, దగ్గు.. ఇలా ప్రతి చిన్న సమస్యకు పారాసిటమాల్ వేసుకోవడం అలవాటు అయిపోయింది చాలామందికి.
అయితే ఈ టాబ్లెట్స్ అతిగా వేసుకోవడం ఆరోగ్యానికి హాని అని చెబుతున్నారు నిపుణులు
పారాసిటమాల్ అతిగా వాడడం వల్ల మోషన్స్, కళ్లు తిరగడం, వాంతులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
అంతే కాదు అదేపనిగా వాడడం వల్ల.. కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయి.
ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు పారాసిటమాల్ వేసుకోకపోవడం మంచిది.
పారాసిటమాల్ లోని కాంపౌండ్స్ ఆల్కహాల్‌లోని ఇథనాల్‌తో నెగెటివ్ రియాక్షన్ జరిపి, అవయవాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది.
శరీరంలో తేలికపాటి నొప్పులు ఉన్నప్పుడు, లైట్‌గా ఫీవర్ వచ్చినప్పుడు సేఫ్టీ కోసం ఒక ట్యాబ్లెట్ వేసుకోవచ్చు.