తీవ్ర రక్తస్రావంతో ICUలో స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్..

భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ హాస్పిటల్‌లో చేరాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో పక్కటెముక గాయం కారణంగా అంతర్గత రక్తస్రావం కావడంతో సిడ్నీలోని ఆసుపత్రిలో చేరాడు.

ప్రస్తుతం అతడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఉన్నాడు.

ఆసీస్ బ్యాటర్ అలెక్స్ కారీని అవుట్ చేయడానికి బ్యాక్‌వర్డ్ పాయింట్ నుండి వెనుకకు పరిగెత్తుతూ అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు.

ఈ ప్రక్రియలో అతని ఎడమ పక్కటెముకకు గాయమైనట్లు కనిపించాడు.

డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వచ్చిన వెంటనే టీం డాక్టర్, ఫిజియో ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా.. వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

రక్తస్రావం కారణంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి దాదాపు 2 నుంచి 7 రోజుల వరకు డాక్టర్ల పర్యావేక్షణలో ఉంటాడు.

దీంతో శ్రేయాస్ త్వరగా కోలుకొని తిరిగి గ్రౌండ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.